Sunday, March 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గడ్డి మందు తాగి విద్యార్థి మృతి

గడ్డి మందు తాగి విద్యార్థి మృతి

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలం అడెల్లి తండాకు చెందిన పదవ తరగతి విద్యార్థి ఆడే రితేష్ (16) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మృతుడు రితేష్ ఇంటి వద్ద ఉన్న వాళ్ళ తాత కారును నడపడానికి తీయగా తాత, నానమ్మ వద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటిలోనె గడ్డి మందు సేవించాడు. కుటుంబీకులు వెంటనే నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదివారం నిజమాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతిని తండ్రి జాదవ్ కేశవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -