- Advertisement -
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
స్నేహితునితో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన విద్యార్థి.. ప్రమాదవశాత్తు ఎస్‌ఎల్‌బీసీ కాలువలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం నల్లగొండ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం విద్యుత్‌నగర్ కాలనీకి చెందిన పర్వతం కిరణ్‌సాయి(12) ఏడవ తరగతి చదువుతున్నాడు. కాగా, తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో కలిసి ఆడుకోవడానికి ఆర్జాలబావి గ్రామ శివారులో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మృతిచెందాడు. మృతుని తండ్రి వేణుగోపాలచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



