Sunday, November 2, 2025
E-PAPER
Homeక్రైమ్హాస్టల్ లో ఉరేసుకుని విద్యార్థిని మృతి

హాస్టల్ లో ఉరేసుకుని విద్యార్థిని మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్దకల్
మల్దకల్ మండల కేంద్రానికి చెందిన నాగేష్ పద్మమ్మ దంపతుల కూతురు ప్రియాంక (15) ఆత్మహత్య చేసుకుందని సోమవారం హాస్టల్ వార్డెన్లు తెలిపారు. మల్దకల్ లో సీటు వస్తే అక్కడనుండి ఆమెకు మహబూబ్ నగర్ గురుకులానికి బదిలీ చేశారు. మూడు రోజుల క్రితం హాస్టల్ వాతావరణం బాగాలేదని బాలిక తల్లిదండ్రులకు చెప్పిందని, అయితే తాము సోమవారం వస్తామని కూతురికి నచ్చజెప్పామని తెలిపారు. అయినా ఈరోజు ఉదయం హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకొని చనిపోయినట్లు హాస్టల్ వార్డెన్లు తల్లిదండ్రులకు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -