Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థి దశే భవిష్యత్తుకు బంగారు పునాది 

విద్యార్థి దశే భవిష్యత్తుకు బంగారు పునాది 

- Advertisement -

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
నవతెలంగాణ – వనపర్తి 

విద్యార్థులు జీవితంలో ఎదగాలంటే ఉన్నతస్థాయి లక్ష్యాలను ఎంచుకోవాలి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి కఠోరమైన దీక్ష, క్రమశిక్షణతో ముందుకు సాగవలసి ఉంటుందని విద్యార్థులు ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం గోపాల్ పేట్ మండలం బుద్ధారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు బానిస కావొద్దని.. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని విద్యార్థి దశలో క్రమశిక్షణ, నైతిక విలువలు చదువుపై దృష్టి పెట్టడం వలన మాత్రమే ఉన్నత భవిష్యత్తు సాధ్యమని, తల్లిదండ్రులు పిల్లలను చదివించడంలో పడుతున్న కష్టాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, సమాజంలో ఉన్న రుగ్మతల నుండి దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత హెచ్. రమేష్ బాబు, బుద్ధారం మాజీ సర్పంచులు, అచ్యుత రామారావు, జాంప్లా నాయక్ , విశ్వవాణి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, పూలియా నాయక్, విష్ణు, సలహాదారు డాక్టర్ పి. శేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -