- Advertisement -
నవతెలంగాణ – జోగులంబ గద్వాల
కరాటే పోటీల్లో గద్వాల పట్టణానికి చెందిన బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ విద్యార్థిని అమీరా రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. నవంబరు 4న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 69వ S G F జిల్లా స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. గద్వాల పట్టణానికి చెందిన అమీరా 14 సంవత్సరాల లోపు 50 + కేజీల బరువులో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌజన్య, డైరెక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. క్రీడా మెలకువలు నేర్పిన మాస్టర్ అర్పత్ ను అభినందించారు. రాష్ట్రస్థాయిలో మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి, గద్వాల జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
- Advertisement -



