– పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో తక్కువ ర్యాంకు వచ్చిందని
నవతెలంగాణ – ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో తక్కువ ర్యాంకు వచ్చిందని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన గూడ శ్రీనివాస్ రెడ్డి, స్రవంతి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు స్నేహలత ఇటీవల పదవ తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు హాజరైంది. అయితే, ఫలితాల్లో తక్కువ ర్యాంకు రావడంతో ఆమె తీవ్రం మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నేహలత గది ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -