Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ సదస్సులో విద్యార్థుల ప్రతిభ 

జాతీయ సదస్సులో విద్యార్థుల ప్రతిభ 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ  మహిళ డిగ్రీ కళాశాల ఆర్మూర్ విద్యార్థులకు జాతీయ సదస్సులో  ప్రథమ , ద్వితీయ బహుమతులు పొందినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్చంద్రిక బుధవారం తెలిపారు.

గిరిరాజ్ కళాశాల నిజామాబాద్, రసాయన శాస్త్రం  విభాగం నిర్వహించిన జాతీయ సదస్సుకి ముఖ్య అతిథి సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. పైడి. ఎల్లారెడ్డి విచ్చేసినారని , తెలంగాణ సాంఘిక సంక్షేమ  మహిళ డిగ్రీ కళాశాల  కళాశాలకు చెందిన విద్యార్థినిలు ఎస్ .వైష్ణవి పేపర్ ప్రజెంటేషన్లో మొదటి బహుమతిని, ఎం. సారిక పోస్టర్ ప్రజెంటేషన్లో ద్వితీయ బహుమతిని అందుకోవడం జరిగిందని తెలిపారు. అందుకుగాను కళాశాల  వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. సుజాత. రసాయన శాస్త్ర అధ్యాపకులు కే. శైలజ, వై. సౌజన్య , అధ్యాపకులు విద్యార్థినిలను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -