- Advertisement -
నవతెలంగాణ – రాయపర్తి
బాసర ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలను ఆదివారం విడుదల చేసిన జాబితాలో మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థిని మర్రి రక్షిత ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారె కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 600 మార్కులకు గాను 562 మార్కులతో మొదటి స్థానం సాధించి ట్రిపుల్ ఐటీలో అవకాశం పొందడం సంతోషకరమని తెలుపుతూ రక్షితను అభినందించారు. నాణ్యమైన విద్యను అందజేసే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన రక్షతకు, ఉపాధ్యాయ బృందానికి స్థానికులు అభినందనలు తెలిపారు.
- Advertisement -