Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల సామర్థ్యాలను వెలికి తీయాలి

విద్యార్థుల సామర్థ్యాలను వెలికి తీయాలి

- Advertisement -

• మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ-పెద్దవంగర
వినూత్న రీతిలో విద్య బోధన చేపడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికి తీయాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పోచంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈవో సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు సామర్ధ్య పరీక్షలు నిర్వహించి, వారి పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాలు బోధించాలన్నారు. తరగతి వారీగా విద్యార్థుల సామర్ధ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థులు, బడికి రాని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -