Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థులపై చీపురుతో దాడి

విద్యార్థులపై చీపురుతో దాడి

- Advertisement -

సంక్షేమంపై సీఎం సమీక్ష ఏది? : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జగిత్యాల ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో పని చేస్తున్న కామటి శ్రీనివాస్‌ విద్యార్థులపై చీపురుతో దాడికి పాల్పడటం అత్యంత దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. నాలుగు నెలలుగా కామటి శ్రీనివాస్‌ మద్యం మత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నా ఉపేక్షించారంటే విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంత పట్టింపు లేనితనంతో ఉన్నారో అర్థమవుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వంద మందికిపైగా గురుకు లాలు, హాస్టళ్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గురు ్తచేశారు. విద్యాశాఖను తన వద్ద అట్టి పెట్టుకున్న సీఎం సమీక్షించకపోవడంతో అధికారులతో పాటు సిబ్బంది కూడా బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -