సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించండి
సైబర్ మోసాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనది
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో సైబర్ మోసల పట్ల విద్యార్థులకు డిచ్పల్లి సిఐ వినోద్ అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ దోషాలు కుదిరితే ఉంటుంది 1930 సంప్రదించాలన్నారు. సైబర్ మోసాలలొ గోల్డెన్ అవర్ ముఖ్యమైనదని తెలియజేశారు. సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ చలామణి మొదలగు మోసాలు జరుగుతున్నాయని వాటిపట్ల అప్రమత్తులతో వ్యవహరించాలని వాటిని నమ్మవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాల ఉచ్చులో పడ్డట్లయితే వారు 1930 ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ సంప్రదించాలని లేదా www.cybercrime.gov.in లాగిన్ అయి రిపోర్ట్ చేయగలరని సూచించారు.
ఆర్థికపరమైన నష్టాలు జరిగిన వెంటనే గ్రహించి గంటలోపు ఫిర్యాదు చేసిన యెడల జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించిన వారి అకౌంట్లో డబ్బులను ఆపి ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్ను ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువతను నిరుద్యోగ అవకాశాల పేరుతో సైబర్ క్రైమ్ బాధితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ చూపి వారి ద్వారా డబ్బులను లూటీ చేయడం జరుగుతుందని దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె. వినోద్ డిచ్ పల్లి M D. మాలిక్ S I జక్రాన్పల్లి పోలీస్ కానిస్టేబుల్ లు దేవిక సైబర్ వారియర్, ప్రశాంత్, నిఖిల్, రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో చాలా రకాలైనటువంటి నేరాలు , సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతున్నాయి. వాటి వల్ల ప్రజలు మోసం పోతున్నారనే విషయాన్ని గ్రహించాలని, ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన వాటిని మాత్రమే నమ్మే విధంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES