Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విత్తన బంతుల తయారీపై విద్యార్థులకు అవగాహన

విత్తన బంతుల తయారీపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని పోచంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సీడ్ బాల్ క్యాంపెయిన్ (విత్తనాలు బంతులు) కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించి, గ్రామ అభివృద్ధి కమిటీ కామన్ ల్యాండ్ లో విద్యార్థులతో వేయించారు. ఈ సందర్భంగా సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రోగ్రాం మేనేజర్ ఉదయ్ మాట్లాడుతూ ఈ విత్తన బంతులు వేయడం ద్వారా వర్షం పడ్డప్పుడు, అనుకూలమైన వాతావరణం విత్తన బంతిలో ఉన్న విత్తనానికి అందినప్పుడు మొలకెత్తేందుకు  ఆస్కారం ఉంటుందన్నారు.  పర్యావరణం కాపాడడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

పర్యావరణంపై పిల్లలకు, గ్రామ ప్రజలకు అవగాహన పెంపొందించడానికి  ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. విత్తన బంతులు తయారు చేసుకోవడానికి 60శాతం ఎర్ర మట్టి, 30 శాతం కంపోస్ట్, 10 శాతం బొగ్గు పడి లేదా బూడిద అవసరమవుతాయని తెలిపారు. అన్ని కలుపుకొని దానిలో కొద్దిగా నీటిని కలిపి ఆ మిశ్రమము చిన్న బంతి లేదా లడ్డు లాగా చేసుకుంటూ విత్తనాన్ని మధ్యలో పెట్టి గుండ్రంగా చేసుకోవాలన్నారు.తర్వాత నీడలో ఒకటి లేదా రెండు రోజులు ఆరబెట్టుకోవాలని తెలిపారు. ఇప్పుడు తయారైన బంతులు మనకు కావలసిన చోట చల్లుకోవచ్చని, వర్షాలు పడిన తర్వాత విత్తన బంతుల్లోంచి విత్తనం మొలకెత్తి చెట్లు లాగా మారుతాయన్నారు. ఈ విత్తనబంతి విధానము సులువైనదని, మనుషులు వెళ్లలేని చోట్లో కూడా ఈ ద్వారా మొక్కలను పెరిగేలా చేయవచ్చన్నారు. 

వర్షాలు పడిన తర్వాత  విత్తన బంతులు కరిగి విత్తనం మొలకెత్తుతుందన్నారు. వాటికి కావాల్సిన పోషకాలు మట్టి ద్వారా, కంపోస్టు ద్వారా మొక్క ఎదుగుతుందన్నారు. వర్షం పడే వరకు ఆ విత్తన బంతిలో ఉన్న విత్తనము  అలాగే ఉంటుందని విద్యార్థులకు వివరించారు. అనంతరం గ్రామంలోని పలుచోట్ల ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో  సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రోగ్రాం మేనేజర్ ఉపేంద్ర, సీఆర్పీలు చింత శ్రీనివాస్, నోముల మహేందర్, శివ సాయి, వెంకటేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి  సమత, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబాద్రి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img