Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు కోసం విద్యార్థుల రాస్తారోకో

రోడ్డు కోసం విద్యార్థుల రాస్తారోకో

- Advertisement -

– బురదలో నిలబడి నిరసన
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌

రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం విద్యార్థులు రాస్తారోకో చేఆరు. కుమురంభీం- ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి-అందవెల్లి రహదారి మధ్యలో బురదలో నిలబడి నిరసన తెలిపారు. అందవెల్లి గ్రామ విద్యార్థులు భట్టుపల్లి ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. కానీ, వారు వెళ్లాల్సిన రోడ్డు పూర్తిగా గుంతలు పడి బురద నీటితో నిండిపోయింది. కాలి నడకన కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కోట ప్రసాద్‌ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపడతామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -