నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామ ఎంపియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జైచంద్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన జండా వదన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వివిధ మహనీయుల వేషధారణలో ఉండి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
గ్రామంలోని పెద్దలు సంబరంగా భావించి సాధారంగా వారిని గౌరవించారు. అదేవిధంగా గ్రామ పరిధిలో ఉన్న కేజీబీవీ గురుకులం పాఠశాలలో ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాల్గొని ఆటలో పోటీలను విద్యార్థినిలకు ప్రశంస పత్రంతో పాటు బహుమతులను అందజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విషయాలను విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ పాఠశాల బస్వాపూర్ హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి పాలకవర్గ సభ్యులు , గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.



