నవతెలంగాణ – కుభీర్
ప్రభుత్వం విద్యార్థులకు మెరగైన విద్య బోధన అందించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుంది కానీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు రావాలంటే బస్సు సౌకర్యం కల్పించాలి కానీ ఇక్కడి విద్యార్థులకు అలాంటి సౌకర్యలు లేక కొందరు విద్యార్థులు బడి మానేసి ఇంటి వద్దే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మండలంలోని పార్డి( బి ) ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విరేగాం, మార్లగొండ బ్రమేశ్వర్, సేవదాస్ నగర్, నంద్ పాడ్, గ్రామాల నుంచి ప్రతి రోజు 30 మంది రాకపోకలు నిర్వహించి విద్యాబ్యాసం చేయడం జరుగుతుంది.
గతంలో ఇక్కడ వచ్చే విద్యార్థులకు ఉదయం 9గంటలకు సాయంత్రం 5గంటలకు ఉండేది కానీ ఇప్పుడు సమయానికి బస్సు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాల సమయం కాకముందే మధ్యాహ్నం ఇంటికి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు చర్యలు తీసుకొని విద్యార్థుల భవిషత్తు ను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం బడి సమయానికి బస్సు సౌకర్యం కల్పించేలా చూడలని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కోరారు.