- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని పెద్ద గోపులారం పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి వసతి లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని విద్యార్థులకు అందించాల్సిన ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు పశువుల తొట్టి వద్ద నీటిని తాగడం నవతెలంగాణ గమనించింది. ఇకనైనా అధికారులు గ్రామ ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శి స్పందించి విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -