Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకోడి కూర కోసం కొట్టుకున్న విద్యార్థులు..

కోడి కూర కోసం కొట్టుకున్న విద్యార్థులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థులు కోడికూర విషయంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం కామన్ మెస్‌లో కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ వడ్డిస్తున్నారనే వాగ్వాదం భౌతిక దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి తల పగిలి తీవ్ర రక్తస్రావం కాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అంతకుముందు రోజు ఉడకబెట్టిన గుడ్ల విషయంలోనూ స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -