ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థుల వార్షిక హాల్‌టికెట్లను డౌన్ చేసుకునేందుకు వీలుగా లింక్‌ను వారి తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్‌కు పంపించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం పరీక్షల కంట్రోలర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని తల్లిదండ్రులు అర్థం చేసుకునేలా, పరీక్షల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉండబోతుందని వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ ఎస్సెస్సీ రోల్ నెంబర్, పుట్టిన తేదీని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి పాసైన సబ్జెక్టులు, ఫెయిలైన సబ్జెక్టులు, ఎగ్జామినేషన్ షెడ్యూల్ తదితర వివరాలను పొందుపర్చనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల హాల్‌టికెట్‌లో సబ్జెక్ట్స్, మీడియం, గ్రూప్, ఫొటో, సిగేచర్, వ్యక్తిగత వివరాలు సరిగా ఉన్నాయో? లేవో? చూసుకుని ఏవైనా మార్పులు అవసరమైతే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను సంప్రదించాలని సూచించారు.



