ప్రధానోపాధ్యాయురాలు శేషావల్లి
నవతెలంగాణ – పెద్దవంగర
విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని వడ్డెకొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. శేషాద్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణీ తొర్రూరు అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి అన్నారు. సేవా తరుణీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఆల్ ఇన్ ఆల్ లు, మ్యాట్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదువుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, పద్మావతి, ఉమా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES