Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం 

ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా నిజాంబాద్ జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ జి హెచ్ ఎస్ కోటగల్లి నందు సోమవారం నిర్వహించారు. జిల్లాలోని 33 మండలాల్లోని విద్యార్థులు 65 మంది హాజరయ్యారు. టాలెంట్ టెస్ట్ ఒక గంట పాటు డిజిటల్ లో 50 మార్కులకు గాను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీఈవో అశోక్ కుమార్ , ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివప్రసాద్, పసుపుల రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎఫ్ పి ఎస్ టి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, జిహెచ్ఎం సాయి, గగన్ కుమార్ వెనుగోళ్ల సురేష్ పాల్గొన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ లో మొదటి స్థానంలో బి వర్ణిక జెడ్పిహెచ్ఎస్ కలిగోట్ ద్వితీయ స్థానంలో, జి హర్షద తృతీయ స్థానంలో, కార్తికేయ జడ్పిహెచ్ఎస్ కమ్మర్పల్లి మెరగైన స్థానాలను దక్కించుకున్నారు. ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు ఫిజికల్ సైన్స్ ను ఇష్టపడి చదివితే మంచి సాఫ్ట్వేర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ముందుకెళ్తారని వారు తెలిపారు. ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఈ ఫోరం ద్వారా గత 11 సంవత్సరాల నుండి ఈ టాలెంట్ టెస్ట్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వివిధ మండల బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -