జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే-21 st అక్టోబర్)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు సంబంందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నామన్నారు, ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని , ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పి గారు సూచించారు.
వ్యాసరచన అంశం
“Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs”
(డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు)
పోటీలో పాల్గొనే విధానం
1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి:
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
2. మీ పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయండి.
3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్‌లో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం 8712661828 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.