మీ సంతకమే ఆటోగ్రాఫ్ కావాలి
లక్ష్యంతో ముందుకు పోవాలిg ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
విద్యార్థులు ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని, భవిష్యత్తులో మీ సంతకం ఆటోగ్రాఫ్ కావాలని ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు పోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం మండల పరిధిలోని నడింపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ కు చెందిన బెస్ట్ రన్నర్స్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సంస్థ వారు
విద్యార్థులకు సైకిళ్ల ను విరాళంగా ఇచ్చింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఎమ్మెల్యే వచ్చారు. విద్యార్థులు పూలు చల్లుతూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులను దర్శించి ఎమ్మెల్యే మాట్లాడారు. చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా విద్యార్థులు చదువుకోవాలన్నారు. అంబేద్కర్ తరగతి గది బయట కూర్చొని చదువుకొని చరిత్ర సృష్టించాడని, మంచిగా చదివే విద్యార్థులకు సహకరించడానికి దేశంలో రాష్ట్రంలో ఎన్నో స్వచ్ఛత సంస్థలు ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
సైకిళ్లను సద్వినియోగం చేసుకొని పాఠశాలకు క్రమశిక్షణతో సమయపాలన రావాలని సూచించారు. జూలై, ఆగస్టు లో ఇదే పాఠశాలలో మరికొందరికి సైకిల్ ఇచ్చేందుకు మా సంస్థ కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల కు విద్యార్థులకు సైకిల్ ఇచ్చేందుకు సంస్థ వారితో మాట్లాడి సహకరించిన ఉపాధ్యాయులు శ్రీను వాసులుకు గ్రామస్తులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, సర్పంచ్ పద్మ సంస్థ నిర్వాహకులు సతీష్, రంజిత్, ఉపాధ్యాయులు సాజీద్, జాఫర్, రవీందర్ రెడ్డి, బషీర్ ఉన్నారు.



