- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ కు చెందిన విద్యార్థులు కందగడ్ల రుద్రంష్ అనే విద్యార్థి నవోదయ విద్యాలయ సమితి లో జిల్లా స్థాయిలో అర్బన్ నుండి మొదటి ర్యాంకు సాధించి 6వ తరగతికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల మేనేజ్మెంట్ భానుతేజ గురువారం తెలిపారు. బాకూర్ మాణితేజ జిల్లా స్థాయిలో అర్బన్ నుండి ఎనిమిదివ ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఇట్టి విద్యార్థులను జిల్లా కార్యదర్శి రావినాథ్, పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ లు సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -