Monday, February 16, 2026
E-PAPER
Homeజిల్లాలుపీజీ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళ‌న‌

పీజీ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళ‌న‌

- Advertisement -
  • పరిపాలన భవనం ముట్టడి

నవతెలంగాణ-డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ నుండి జరిగే పీజీ ఫస్ట్ ఇయర్, ఇంటిగ్రేట్ పరీక్షలు వాయిదా వెయ్యాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి నాయ‌కులు పరిపాలన భవనం ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ మాట్లాడుతూ.. సెల‌బస్ కాకముందే పరీక్షలు నిర్వహించడం సిగ్గుచేటని, దీని ద్వారా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంద‌ని వాపోయారు. తక్షణం పరీక్షలను నిలిపివేయాలని ధర్నా నిర్వహించారు. విద్యార్థుల కోరిక మేరకు యూనివర్సిటీ అధికారులు పరీక్షలను వాయిదా వేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు పృథ్వి, సెక్రెటరీ సమీర్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు మనోజ్,జాయింట్ సెక్రెటరీ అనిల్, నాయకులు మోహన్ ,దుర్గా దాస్, రాహుల్, మహర్షి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -