నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణంలోని మహదేవ్ ఫంక్షన్ హాల్‌లో ఓకినవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. అకాడమీ ఫౌండర్, చీఫ్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షల్లో సుమారు 80 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకొని వివిధ బెల్టులు, సర్టిఫికెట్లు పొందారు.
కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్. రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు మైలారం రాము, రోమాల ప్రవీణ్ హాజరై విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..చిన్న వయసులోనే కరాటే శిక్షణ పొందడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా కరాటే శిక్షణ ఇస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పతకాలు సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించిన అబ్దుల్ మన్నాన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు దండగల తిరుపతి, లోలోపు రాజు, కనికరపు రాజశేఖర్, ఫర్హాన్ అబ్బాసి తదితరులు పాల్గొన్నారు.