నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
తెలంగాణ సంస్కృ తి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆయా పాఠశాలల విద్యార్థినులు బతుక మ్మ సంబురాలను ఆదివారం నుచ్చి దసరా పండుగ సెలువులు కావటంతో విద్యార్థులు శనివారం ఘనంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. బాలికల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, సరస్వతీ పాఠశాలల్లో చిన్నారులు బతుకమ్మ సంబురాలు జరుపుకొన్నారు. ముందుగా వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పూజ లు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. ఆడపడుచులు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. చిన్నారు లు సైతం బతుకమ్మలను అందంగా పేర్చి పూ జలు చేశారు. అనంతరం సమీపంలోని కొలనులో, నీటి తొట్లలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
తీరొక్క పూలను పేర్చి.. పూజలు చేసిన విద్యార్థినులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES