నవతెలంగాణ – కామారెడ్డి; పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో శనివారం భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8 వేలకోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ ల మీద విడుదల చేయకుండా పట్టుబట్టి కూర్చోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. బకాయిలు విడుదల చేయమనీ కళాశాలల యజమాన్యాలు అడుగుతే వారిపై ప్రభుత్వం కక్ష కట్టి విజిలెన్స్ దాడులు చేయడం భావ్యం కాదని ఇది నియంత పాలనకు నిదర్శమని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వక విద్యార్థులు నలిగిపోతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రుల, ముఖ్యమంత్రి ఇల్లు ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, సాయినాథ్, అనిల్, భాను ప్రసాద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



