నవతెలంగాణ – నకిరేకల్
69వ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ జి ఎఫ్ఐ కరాటే పోటీల ఎంపికలో నకిరేకల్, నార్కట్ పల్లి మండలాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జెకె ఎ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అంతటి సోములు గౌడ్ తెలిపారు. అండర్ 14 బాలికలు 30 కేజీల విభాగంలో శ్రీలక్ష్మి, అండర్ 14 బాలుర 30 కేజీల విభాగంలో మోహన్ గణేష్ నకిరేకల్ కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. అండర్ 17 బాలుర 35 కేజీల విభాగంలో విగ్నేష్, 40 కేజీల విభాగంలో మని కృష్ణ ఎంజేపి నార్కట్ పల్లి హాస్టల్ కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఎస్ జి ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల మెడల్స్, సర్టిఫికెట్ అందజేసినట్లు తెలిపారు.
కరాటే రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



