Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం మాట్లాడుతూ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి నెల 6, 7 తేదీలలో అండర్-14 బాలికల, బాలుర  ఉమ్మడి జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులు శేర్విని, రిశ్వంత్ సాఫ్ట్ బాల్ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు.

ఈనెల 3 నుండి సుద్దపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జరిగిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్న  పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని శేర్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైందని తెలిపారు. అదేవిధంగా జక్రాన్ పల్లి మండలం  తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్న  రిశ్వంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్  నాగభూషణం తెలిపారు.

ఈ నెల 7,8,9తేదీలలో మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరగబోయే రాష్ట్ర స్థాయి బాలికల, బాలుర టోర్నమెంట్ లో శేర్విని, రిశ్వంత్ పాల్గొంటారన్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక ఇవ్వడం పట్ల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగ రామ స్వామి, సభ్యులు బుచ్చిమల్లయ్య , ఉపాధ్యాయ బృందం గ్రామ యువకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన  క్రీడాకారులను, ఎంపికకు ప్రత్యేక కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్  వేముల నాగభూషణంను ప్రత్యేకంగా అభినందించారు. మునుముందు జరుగబోయే రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో రిశ్వంత్, శేర్విని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -