Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తీవ్ర చలికి వసతి గృహాల్లో వణుకుతున్న విద్యార్థులు 

తీవ్ర చలికి వసతి గృహాల్లో వణుకుతున్న విద్యార్థులు 

- Advertisement -

పట్టించుకోని ప్రభుత్వం
సభ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ ఎఫ్ ఐ ధర్నా
కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ప్రస్తుతం శీతాకాలంలో హాస్టల్లో ఉండే విద్యార్థులు చలికి వణికి పోతున్నారని, అవసరమైన దుబ్బట్లు రగ్గులు వెంటనే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్ర రూపం దాల్చడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ,ఎస్టీ బీసీ ,సంక్షేమ వసతి గృహాలు, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీ ,గురుకుల పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల విద్యార్థీనిలు సరైన సొంత భవనాలు లేక హాస్టల్ విద్యార్థులు గురుకుల విద్యార్థులు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఉండే రూములకు తలుపులు లేక కిటికీలు రేక్కలు  లేక వసతి పొందుతున్న విద్యార్థులు అనేకవస్థలు పడుతూ తీవ్రమైన చలికి వణికి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 తక్షణమే జిల్లా కలెక్టర్   ప్రభుత్వంతో మాట్లాడి  సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు, చలికి తట్టుకునే దుప్పట్లను రగ్గులు మరియు విద్యార్థులకు ఉన్ని స్వెటర్లు అందించే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. .లేదంటే జిల్లా కలెక్టర్ స్పెషల్ గ్రాంట్  తో గాని పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను తీవ్రమైన చలి నుండి కాపాడాలని కోరారు. విద్యార్థులు ఉదయం పూట చన్నిటిస్నానాలు చేయడం ద్వారా జలుబు దగ్గు జ్వరం బారిన పడుతున్నారన్నారు.  విద్యార్థుల కువేడి నీటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ గత ప్రభుత్వ మాదిరిగా రగ్గులను స్వెటర్లను అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో  డివిజన్ అధ్యక్షా కార్యదర్శులు మూడవత్ జగన్ నాయక్, కుర్ర సైదా నాయక్, వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్, అంజి, సిపాయి, రాజేష్, సాయి, హనుమంతు, నవీన్, సూర్య, ,సుబాని, బన్ని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -