Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

- Advertisement -

– ఘనంగా  సైన్స్ పెయిర్ దినోత్సవం..
– ఏంఈఓ అబ్దుల్ రెహ్మాన్
నవతెలంగాణ – ఊరుకొండ 

విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చదువుతోపాటు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని మండల విద్యాధికారి అబ్దుల్ రెహ్మాన్ అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వేంకట బాల్ రామయ్య పాఠశాలలో సి.వి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ పెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి అబ్దుల్ రహీం ముఖ్య అతిథిగా హాజరై.. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించారు.

విద్యార్థులు దాదాపు 100 అమరికలతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. అనంతరం వ్యాస రచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల ఛైర్మన్ సామల తిరుపతయ్య విద్యార్థులను అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ బాల్ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉండాలని.. బాల శాస్త్రవేత్తలుగా గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల మంజులశ్రీనివాస్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, రెయిన్ బో పాఠశాల ప్రిన్సిపాల్ నస్రీన్, పాఠశాల ప్రిన్సిపాల్ జార్జ్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ రామ్, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -