Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

- Advertisement -

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.రజని
నవతెలంగాణ – వనపర్తి 

నేటి సమాజంలో భారత రాజ్యాంగం, చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, చదువుతోపాటు చట్టాల పైన అధ్యయన కొనసాగించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి రజిని సూచించారు. మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా  కొత్తకోట మండలం పామపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడారు. విద్యార్థులకు ఆర్టికల్ -14, ఆర్టికల్ -19, ఆర్టికల్ -21 ల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ ఆర్టికల్స్ ను గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటారని తెలిపారు. మహిళలకు, చిన్నపిల్లలకు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, వయోవృద్ధులకు, మతి స్థిమితం లేని వారికి, సామూహిక విపత్తు, మానవ అక్రమ రవాణా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం నాల్సా 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -