Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు గంజాయి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

విద్యార్థులు గంజాయి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్  హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

విద్యార్థి దశ చాలా కీలకమైనదని, విద్యార్థులు గంజాయి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మినీ మీటింగ్ హాల్ లో జిల్లా లో గంజాయి నియంత్రణపై  నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంక్ష్ యాదవ్ , అడిషనల్ డిసిపి లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో గంజాయి దృష్టి పెట్టాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, డ్రగ్స్ఇన్స్పెక్టర్, వైద్య, విద్యా, అటవీ, ఆర్టీసీ, సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ  జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. జిల్లా లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

గంజాయి మీద దృష్టి పెట్టి, యువతను, విద్యార్థులను  గంజాయి, ఇతర మత్తు పదార్థాల నుండి కాపాడాలన్నారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతకు వాటి వల్ల కలిగే నష్టాలపై  వివరించాలని, ఎక్కువగా కళాశాలలు ఉన్న చోట నష్టాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని  అన్నారు. గంజాయి చాలా ప్రమాదకరమైనదని భవిష్యత్తును అంధకారంలోకి తీసుకువెళ్తుందనే విషయాలను యువతకు తెలియజేయాలన్నా రు. జిల్లాకు సరిహద్దు రాష్ట్రాల నుండి గంజాయి పదార్థాలు రాకుండా అన్ని చెక్ పోస్ట్ లలో గట్టి నిఘా పెంచి పటిష్ఠ చర్యలు చేపట్టాలని, జిల్లాలో గంజాయి పంట సాగును గుర్తించా లన్నారు.  రవాణా,  అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టి మూలాలతో సహా గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఐటిఐ, పాలిటెక్నికల్, ఫార్మసీ కళాశాలల్లో , విద్యార్థులకు అవసరమైతే భవిష్యత్తును నాశనం చేసే  గంజాయిపై అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని సూచించారు.  తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై  కన్నేసి ఉంచాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా  తమ పిల్లలను చూసుకోవాలన్నారు. 

డిప్యూటీ పోలీస్ కమిషనర్  అక్షాంక్ష్ యాదవ్ మాట్లడుతూ. సెప్టెంబర్ నెల మాసం లో   రెండు గంజాయి కేసులను గుర్తించడం జరిగిందన్నారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీస్ శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ల వద్ద  గట్టి నిఘా ఉంచామని తెలిపారు. జిల్లా లోని కళాశాలల్లో, గంజాయి, మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో  భువనగిరి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి,శేఖర్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్నెంట్ విష్ణుమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -