Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి: కలెక్టర్

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
చదువే ఆయుధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. గురువారం గోవిందరావు పేట మండలం పసర గ్రామంలోని జెడ్పీ హెచ్ ఎస్ పాఠశాల ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మికంగా సందర్శించి  హాజరైన టీచర్ల వివరాలను  రిజిస్టర్, అలాగే మధ్యాహ్న భోజనం కి సంబందించిన రిజిస్టర్ లని పరిశీలించారు. అనంతరం క్లాస్ రూం లకు వెళ్లి విద్యార్థులతో పలు అంశాల పైన మాట్లాడారు. అందరికి యూనిఫామ్స్, నోట్ బుక్స్ వచ్చాయా, మధ్యాహ్న భోజనం బాగుంటుంద.. మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని.. అలాగే ఫుడ్ కమిటీ లో ఉన్న విద్యార్థులతో ప్రత్యేకంగా… భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు.

9వ, 10 వ తరగతి  విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించి వంద శాతం అందరూ హైఎస్ట్ మార్క్ లు వచ్చేలా కృషి చేయాలన్నరు.  ఏ ఏ విద్యార్థులు ఏ సబ్జెక్ట్ ల్లో వీక్ గా ఉన్నారో ఒక్కో విద్యార్థి ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వీక్ ఉన్న సబ్జెక్ట్ లను ఉపాధ్యాయులు రివిజన్ చేయాలన్నారు. ప్రతీ రోజూ విద్యార్థులు పాఠశాలకి వచ్చేలా  మానటరింగ్ చేయాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహారం తయారీ సమయంలో నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని, బడి బయట పిల్లలు, మధ్య బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -