అభివృద్ధిలో పాలుపంచుకోవాలి
నవతెలంగాణ – ఆలేరు టౌను
విద్యార్థులు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని అలవరచుకుని ,దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఎన్ సి సి అధికారి దూడల వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం జడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 2026-27 సంవత్సరానికి, పదో ఎన్సీసీ వరంగల్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆర్మీ వింగ్ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఉత్తమ లక్షణాలు గలయువతను తయారు చేసేందుకు ఎన్ సి సి ఉపయోగపడుతుందని అన్నారు.
విద్యార్థుల భావి జీవితం బంగారు బాట అవుతుందని అన్నారు. ఎన్ సి సి తో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పెరుగుతుందన్నారు. శిక్షణలో రెండు సంవత్సరాల పాటూ విద్యార్థులకు సైనిక విభాగంలో డ్రిల్, పరేడ్, వెఫన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, హెల్త్ అండ్ అవేర్నెస్, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత, ఫీల్డ్ క్రాఫ్ట్ బాటిల్ క్రాఫ్ట్ మరియు శారీరక తదితర అంశాలలో ఉంటుందన్నారు.
విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభిస్తుందని అన్నారు. ఎంపికలో 67 మంది విద్యార్థులకు, శారీరక సామర్థ్యాన్ని పరీక్షించి, 49 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పదవ తెలంగాణ ఎన్ సి సి బెటాలియన్ వరంగల్ అధికారులు ఇన్స్ట్రక్టర్ అజీమ్ అలీ, హావల్దార్ ఉద్దవ్ తాన్ శెట్టి, ఉపాధ్యాయ బృందం, కాడెట్లు వినయ్ మనోజ్, సంజయ్, రిత్విక్, వరుణ్, రేచల్, భార్గవి, భవాని తదితరులు పాల్గొన్నారు.



