ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సిహెచ్ మదార్ గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
విద్యార్థులు క్రమశిక్షణ చదువుతోపాటు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సిహెచ్ మదార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 50 మంది వాలంటీర్లతో రామన్నగూడెం గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరం శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యార్థి దశ నుంచి సేవా భావాన్ని పెంపొందించుకోవాలని, ఏడు రోజులపాటు జరిగే ప్రత్యేక శిబిరంలో గ్రామంలో ప్రధానంగా స్వచ్ఛభారత్, మొక్కల నాటడం, ఆరోగ్య శిబిరం, మూఢనమ్మకాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్, కెరీర్ గైడెన్స్ రోడ్డు భద్రత వంటి అంశాలపై అవగాహన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఎ. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి మంచి వేదిక ఎన్ఎస్ఎస్ అని, ఎన్ఎస్ఎస్ లో చేరడం వల్ల వాలంటీర్లు సద్గుణాలను పెంపొందించుకొని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మచ్చా సోమయ్య, కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, యాకన్న, సతీష్, కవిరాజ్, బాబు, నాగేశ్వరరావు, రామ్మూర్తి ఉపాధ్యాయ బృందం బుచ్చిరాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.