Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి..

విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి..

- Advertisement -

వైద్యాధికారిని డాక్టర్ క్రిస్టిన..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రతిరోజు ఉదయము సాయంత్రం దంత దావణం చేసుకోవాలని ప్రతి రోజు శుభ్రంగా స్నానం చేయాలని శుబ్రమైన దుస్తులు ధరించాలని, లేదంటే ఒకరి ద్వారా ఒకరికి గజ్జి తామర చర్మం ఇచ్చే అవకాశం ఉంటుందని ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ క్రిష్టిన సూచించారు. బుధవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర వసతి గృహ పాఠశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి వైద్యాధికారిని డాక్టర్ క్రిస్టినా మాట్లాడుతూ విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, ఆహారం తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చేతులు కడుక్కునే విధానములు  వివరించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన నీటిని త్రాగే నీటిని అందించాలని ప్రిన్సిపాల్ నరేష్ గౌడ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ,ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, మాలిక, ఎం ఎల్ హెచ్ పి లు మల్లేహ సుల్తానా, కీర్తన ఆరోగ్య కార్యకర్తలు సుజాత,స్వర్ణ ఆశా కార్యకర్తలు లలిత,స్వర్ణ లత, మమత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -