విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

– అంకుర హౌమ్స్‌ అధినేతలు
నవతెలంగాణ-శంకర్‌పల్లి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంకుర హౌమ్స్‌ అధినేతలు జైపాల్‌ రెడ్డి, రవి కాంత్‌ రెడ్డి, వెంకట్‌ మొగంటి అన్నారు. అంకుర లిటిల్‌ ఛాంపియన్స్‌ మండల్‌ లెవెల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ 2024 ముగింపు సందర్భంగా ఎంఈఓ సయ్యద్‌ అక్బర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ రాజు నాయక్‌లతో కలిసి ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన బాలికల విభాగంలో జడ్పీహెచ్‌ఎస్‌ పొద్దుటూరు, బాలుర విభాగంలో జడ్పీహెచ్‌ఎస్‌ జన్వాడ ప్రథమ బహుమతులు గెలుపొందగా, తతీయ బహుమతిగా జడ్పీహెచ్‌ఎస్‌ పరివేద, బాలుర విభాగంలో జడ్పీహెచ్‌ఎస్‌ కొండకల్‌ బహుమతులు సాధించారు. వీరికి ప్రథమ బహుమతి నగదు 25000, ట్రోపీలు, ద్వితీయ బహుమతి 15000 ట్రోపీలు, మెడల్స్‌ ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని ఓటమికి కంగిపోవద్దు గెలుపుకు పొంగిపోవద్దు అని అన్నారు. అన్ని పాఠశాలల క్రీడాకారులు చక్కటి ఆటను ప్రదర్శించారని వచ్చే సంవత్సరం మరింతగా రాణించేందుకు కషి చేయాలని దీనికై అంకురా హౌమ్స్‌ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. క్రీడలతోపాటు చదువులో బాగా రాణించాలని తద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అతిధులు శ్రీని సార్‌ (కాగ్నిసివ్‌), అజరు సార్‌ (క్యాన్సర్‌ క్లౌడ్‌), ప్రతాప్‌, సుధీర్‌,వెంకట్‌, లతోపాటు ఆర్గనైజర్స్‌ సామాజిక కార్యకర్త పాప గారి ఆశీర్వాదం, ఎం. విట్టల్‌, మహమ్మద్‌ షాబుద్దీన్‌ లతోపాటు ఉపాధ్యాయ సంఘం నాయకులు తాహెర్‌ అలీ, నాగేష్‌, కోడి కష్ణ, మునీర్‌ పాషా, మాణిక్యం రెఫరీలు శ్రీనాథ్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌, ఆయా పాఠశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటి టీచర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love