Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి..

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జక్రంపల్లి ఉన్నత పాఠశాల లోని విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగన్న  అధ్యక్షత వహించగా స్థానిక ఎంపీడీవో , తాసిల్దార్ , మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ , స్థానిక మెడికల్ ఆఫీసర్ మెడికల్ సిబ్బంది హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ గురించి వివరించడం జరిగింది. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలని బయట ఇతర పదార్థాలను ముట్టినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, లేనట్లయితే ప్రేవులలో నిలిపురుగులు ఉత్పత్తి అయి విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందని డాక్టర్  తెలియజేశారు. విద్యార్థుల యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత గురించి, టాయిలెట్స్ ను వాడేటటువంటి విధానం గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img