జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.రజని
నవతెలంగాణ – వనపర్తి
విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వి రజని మాట్లాడుతూ విద్యార్థులు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం, ఫోక్సో చట్టం గురించి అవగాహన కలిగిిి ఉండాలని పలు అంశాలు, చట్టాలపై వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం NALSA 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తకోట భవనంలో జిల్లాలోని వివిధ మండలాల గణిత శాస్త్ర ఉపాధ్యాయులతో సమావేశం అయ్యి విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు పోష్ యాక్ట్ పై వివరించారు. కొత్తకోటలోని భవితా సెంటర్ ను సందర్శించి దివ్యాంగ పిల్లలను పలకరిస్తూ పిల్లల సామర్ధ్యాలు, వారి ఆరోగ్య సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివేకానంద, పార లీగల్ వాలంటీర్ ప్రతాపరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES