Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు పరిశుభ్రతను అలవర్చుకోవాలి

విద్యార్థులు పరిశుభ్రతను అలవర్చుకోవాలి

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
– విద్యార్థులకు ఆల్బెండజల్ మాత్రల పంపిణీ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
విద్యార్థులు పరిశుభ్రతను అలవర్చుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (నేషనల్ డీ వార్మింగ్ డే) సందర్భంగా విద్యార్థులకు నులి పురుగుల నివారణకు  అల్బెండజోల్ మాత్రలను వేసే కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు పరిశుభ్రతను పాటించాలని, భోజనం చేయడానికి ముందు, మలమూత్ర విసర్జన చేసిన తర్వాత తమ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుకోవాలన్నారు.

పరిశుభ్రతతో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు అన్నారు. కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హసీనా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి  నులిపురుగుల నివారణ మాత్రలు ఎంతో మంచివన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల్లో రక్తహీనతకు నులి పురుగులే ప్రధాన కారణమని, వాటి నివారణకు ఈ మాత్రలు అందరూ తప్పక వేసుకోవాలని. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్, డాక్టర్ హసీనా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న స్వయంగా పిల్లలకు ఆల్బెండజల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కృష్ణవేణి, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, ఉపాధ్యాయ బృందం సభ్యులు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -