విద్యార్థులకు సైకిల్ ల పంపిణీ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. మోడీ గిఫ్ట్ పేరు తో పదవ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సి,ఎస్,ఆర్ నిధులతో అందిస్తున్న సైకిలను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఎంఈఓ భూక్య రాజుతో కలిసి పంపించేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా రాకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని సైకిళ్లను విద్యార్థులకు అందించిందన్నారు.తంగళ్ళపల్లి మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ 298 సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ నారాయణ,వెంకటస్వామి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శిలు ఇటికల రాజు, కోస్నీ వినయ్ యాదవ్,ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్, కోడం భవిత, సిలివేరి ప్రశాంత్, కలికోట చరణ్, ఇటికల మహేందర్, జలపతి కృష్ణ, నందగిరి నవీన్, నుల్గొండ శ్రీనివాస్, అమరగొండ రాజు, గోనపల్లి శ్రీనివాస్, రేగుల రాజు, బాల మల్లేశం, కట్ట తిరుపతి పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES