Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

- Advertisement -

కళాశాల చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – భువనగిరి
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీ సాయి కృప డిగ్రీ, పిజీ కళాశాల చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. శనివారం శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల 2023 – 26 విద్యార్థుల వీడ్కోలు సమావేశం ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. త్వరలోనే మన కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించి ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఉంటానని అన్నారు.

విద్యార్థినీ విద్యార్థులు మాట్లాడుతూ.. వారి డిగ్రీని మూడు సంవత్సరాల కాల పరిమితిలో వారు పంచుకున్న అనుభవాలు కళాశాలకు వారికి ఉన్న బంధాన్ని నెమరు వేసుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు బాధాతప్త హృదయాలతో మాట్లాడుతూ ఆహుతలను కంటతడి పెట్టేలా చేశారు. తదనంతరం విద్యార్థుల ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు.  ప్రిన్సిపల్ యాకుబ్ బాబా, శ్రావణ్ రెడ్డి, మహేందర్, మోయిన్, వీరయ్య మరిపల్లి రాజు, సుమలత, శ్యామ్ కుమార్, రాము మరియు విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -