జిల్లా యువ భారత్ అధికారి.. శైలి
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని బాన్సువాడ సీఐ తిరుపతి సూచించారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో బాన్సువాడ ,బిచ్కుంద, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ బ్లాక్ లో నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బాన్సువాడ పట్టణ సిఐ శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి, ఉమ్మడి
జిల్లా మేరా యువ భారత్ జిల్లా అధికారి బెల్లాల్ శైలి ,చేతుల మీదుగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు. చదువు ఎంత అవసరమో ఆటలు కూడా అంతే అవసరమని, ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమం తప్పకుండా క్రీడలపై తర్ఫీదు ఇవ్వాలని సూచించారు.
క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమని వాటితో సంబంధం లేకుండా ఎలా గెలవాలి అనే తపన మీలో ఉంటే మీ సంకల్పం ఉంటే విజయం మీ సొంతం అవుతుందని తెలిపారు. అలాగే జిల్లా యూత్ ఆఫీసర్ బెల్లా శైలి మాట్లాడుతూ మేరా యువభారత్ భారతదేశంలో ఉన్న యువతకు మంచి సేవ భావాన్ని ఒక కొత్త యువనాయకత్వాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో ఉన్నటువంటి యువతకు ఎన్నో మంచి అవకాశాలను మై భారత్ కల్పిస్తుందన్నారు. యువతకు సన్మార్గంలో నడిపించడానికి భారత ప్రభుత్వం యూత్ మినిస్ట్రీ ఎంతో కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మేనేజర్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ అలాగే పి ఈ టి తారాచంద్ సురేందర్ ప్రేమ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మేనేజర్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ అలాగే పి ఈ టి తారాచంద్ సురేందర్ ప్రేమ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



