Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి

- Advertisement -

-రాయపోల్  ఏఎస్ఐ దేవయ్య..
 నవతెలంగాణ – రాయపోల్
అవసరం ఉంటే తప్ప సోషల్ మీడియాని ఉపయోగించవద్దని విద్యార్థులు సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని రాయపోల్ ఏఎస్ఐ దేవయ్య, గజ్వేల్ షీ టీం హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్ నూతన చట్టాల గురించి అవగాహన  కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దిశ చాలా కీలకం సక్రమ మార్గంలో వెళ్లేవారు ఉన్నత స్థితికి వెళ్తారన్నారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు తెలిసి తెలియని వయసులో ప్రేమ పెళ్లి అంటూ జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. పెద్దలను గురువులను గౌరవించాలని సూచించారు. ఇష్టపడి చదివే వారు తప్పకుండా ప్రయోజకులు అవుతారని జీవితంలో మంచిగా స్థిరపడతారని తెలిపారు. తాత్కాలిక ఆనందం గురించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. తరగతి గదులలో అందరితో కలిసి ఉండాలని ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉపాధ్యాయులకు తెలియపరచాలి. లేకపోతే పోలీసులకు, షీటీమ్స్ ను కానీ సంప్రదించాలని, లేదంటే డయల్ 100, సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల  ఎస్ఓ సుగంధ లత,గజ్వేల్ షీటీమ్ కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad