Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శలో ఎదుగుదలకు కృషి చేయాలి

విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శలో ఎదుగుదలకు కృషి చేయాలి

- Advertisement -

కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్

నవతెలంగాణ – భువనగిరి

విద్యార్థులు చిన్నప్పటినుండే ఉపాధ్యాయుల మార్గదర్శలో ఎదుగుదలకు కృషి చేయాలని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ కోరారు. సోమవారం భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డులో బోయవాడ ఇందిరానగర్ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఉపాధ్యాయులు చూపిన మార్గంలో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని కౌన్సిలర్ కొనియాడారు.

అతిథులుగా అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గాయపాక శోభ, మాజీ మండల విద్యాధికారి బండారు రవి వర్ధన్ లు మాట్లాడుతూ ఇలాంటి సప్పరిపాలన దినోత్సవం విద్యార్థుల జీవితాలలో చాలా మార్పులు తీసుకువస్తాయని విద్యార్థుల భవిష్యత్తులో ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని, అందుకు విద్యార్థులు ఉన్నత ఆశయాలతో పై స్థాయికి రావాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉజ్వల, మహేశ్వరి, అరుంధతి యూత్ సభ్యులు గోపే బాబు, బర్రె క్రాంతి, బర్రె చిరంజీవి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -