నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తూ ఉన్నతశిఖరాలను అవరోధించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ ఎం.విజయదేవి,గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడిచెర్లలో శుక్రవారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల ప్రగతి కోసం కళాశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డ్ చేస్తున్న అన్ని కార్యక్రమాల గురించి అదేవిధంగా కళాశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఐదుగురు పూర్వ విద్యార్థుల వివరాలతో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసి వారిని అభినందించడం జరిగిందమన్నారు.
కళాశాలలో జరిగిన అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ తరఫున జరుగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి, దాతల సహకారం చేత విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై రానున్న ప్రయోగ వార్షిక పరీక్షల గురించి ఇంక వివిధ అంశాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులతో కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు చర్చించడం జరిగిందన్నారు. సర్పంచ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థుల కోసం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. దీనిని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులను సక్రమంగా కళాశాలకు వెళ్లే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



