Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదవాలి: ప్రిన్సిపల్

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదవాలి: ప్రిన్సిపల్

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఎంచుకొని సాధించేందుకు బాగా కష్టపడి చదవాలని కళాశాల ప్రిన్సిపల్ ఎస్ అనసూయ విద్యార్థులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి సత్యనారాయణ శెట్టి వక్తలు పి స్వామి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అన్ని కార్యక్రమాలలో పాల్గొని బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ఉత్తమ విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయలకు మంచి పేరు తేవాలని కోరారు. అలాగే విద్యార్థులు లక్ష్యాన్ని సాధించేందుకు బాగా కష్టపడాలని సూచించారు.

ఐపిఈ మార్చ్ 2025లో ఉత్తీర్ణులైన కళాశాల టాపర్స్ కు టాపర్స్ అయినా ఎం అనసూయ కు 2500 రూపాయలు ద్వితీయ బహుమతి ఎస్ సరిత రూ.1500 తృతీయ బహుమతి ఎం పల్లవి 1000 రూపాయలు నగదు ప్రోత్సకాలను వక్త అయినా పి స్వామి అందించారు. అలాగే తెలుగు అధ్యాపకురాలు ఏ జయలక్ష్మి ఐపిఈ మార్చ్ 2025 లోతెలుగు సబ్జెక్టులో 99 మార్కులు సాధించిన 23 మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి అందించారు. కళాశాలకు నూతనంగా వచ్చిన అధ్యాపకులు శ్రీనివాస్ రావు టీ జంగయ్య, కిరణ్ ప్రియదర్శిని శాలువాలతో సత్కరించారు. అంతకు ముందు విద్యార్థిని విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకన్న, వెంకటయ్య, శోభారాణి, శంషాద్, తులసి, జయలక్ష్మి, విజయలక్ష్మి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -