నవతెలంగాణ-పాలకుర్తి
దాతల సహకారాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎంపీడీవో రవీందర్ సూచించారు. మంగళవారం మండలంలోని వావిలాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య ఆధ్వర్యంలో నేతి శశిరేఖ జ్ఞాపకార్థం వావిలాల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నేతి కొండయ్య డైరీలను బహుకరించడంతో ఎంపీడీవో రవీందర్ విద్యార్థినీ, విద్యార్థులకు డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారి హోంవర్క్ వివరాలను వ్రాసుకునేందుకు విద్యార్థిని, విద్యార్థులకు డైరీలు దోహదపడతాయని తెలిపారు. తల్లిదండ్రులకు పాఠశాలకు మధ్య వారధిగా డైరీలు ఉపయోగపడతాయని తెలిపారు. డైరీలను బహుకరించిన నేతి కొండయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్, ఉపాధ్యాయులు సోమాని నాయక్,బాలాజీ, జస్సింతారాణి, జ్ఞాన కుమారి, సుగుణాదేవి,నీలకంఠం, మంజుల తోపాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
దాతల సహకారాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో రవీందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES