స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు
నవతెలంగాణ – ఆలేరు టౌన్
భయాందోళనలో చెందకుండా, ఇంటర్మీడియట్ విద్యార్థులు , సకాలంలో హాజరై పరీక్షలు రాయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.విద్యార్థులు భయందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష వ్రాయలన్నారు.
విద్యార్థులు పరీక్షకు ఎంతమంది హాజరయ్యారని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది యొక్క పనితీరును పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి, పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.


